![]() |
![]() |

సుప్రసిద్ధ నటుడు, రచయిత దివంగత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివకామసుందరి కన్నుమూశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆమె హన్మకొండలో జన్మించారు. 1961లో మారుతీరావుతో ఆమెకు వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు. మారుతీరావు దంపతులు చెన్నైలోనే స్థిరపడ్డారు.
2019 డిసెంబర్‌లో అనారోగ్యంతో మారుతీరావు మృతి చెందారు. అప్పట్నుంచీ శివకామసుందరి చెన్నైలో కుమారుడు సుబ్బారావు ఇంట్లోనే జీవనం సాగిస్తూ వస్తున్నారు. ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు, వారి కుటుంబానికి సన్నిహితులైన వారు సంతాపం వ్యక్తం చేశారు.
![]() |
![]() |