![]() |
![]() |

గత కొంతకాలంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇప్పటికే ఐదు వరుస విజయాలు చూసిన తారక్.. ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్`తో డబుల్ హ్యాట్రిక్ కి సిద్ధమయ్యారు. వేసవిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రాబోతోంది. `ఆర్ ఆర్ ఆర్` తరువాత విజనరీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తన నెక్స్ట్ వెంచర్ చేయనున్నారు ఈ నందమూరి స్టార్. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాలో తారక్ కి జంటగా `ఆర్ ఆర్ ఆర్` బ్యూటీ ఆలియా భట్ కనిపించనుందని బజ్. అంతేకాదు.. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. ఫిబ్రవరి 7న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందట.
Also read: 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ కే 'ఎఫ్-3'!
కాగా, `ఎన్టీఆర్ 30` అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా తాలూకు స్టోరీ లైన్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదేమిటంటే.. రాజకీయ నాయకుల కారణంగా విద్యార్ధుల చదువుకు ఆటంకం ఏర్పడితే వారికి అండగా నిలిచిన ఓ యువకుడి కథే.. `ఎన్టీఆర్ 30` అట. అయితే, ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Also read: పాతికేళ్ళ `ఎగిరే పావురమా..`!
అన్నట్టు.. 2023 సంక్రాంతికి `ఎన్టీఆర్ 30` తెరపైకి వచ్చే అవకాశముందంటున్నారు. మరి.. `జనతా గ్యారేజ్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత తారక్ - కొరటాల కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |