![]() |
![]() |

శర్వానంద్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ కిశోర్ బి. రూపొందించిన 'శ్రీకారం' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్‌నే సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 4 కోట్లకు పైగా షేర్ సాధించి బయ్యర్లను సంతోషపెట్టింది. ప్రి బిజినెస్ రూ. 16.8 కోట్లతో పోలిస్తే.. 24 శాతం రికవరీ సాధించింది.
వ్యవసాయాన్ని కెరీర్‌గా ఎట్లా మలచుకోవచ్చో నిరూపించే కథతో రూపొందిన 'శ్రీకారం' మూవీ నైజాంలో తొలి రోజు రూ. 1.08 షేర్ వసూలు చేసింది. ఈ ఏరియాలో అది చేసిన ప్రి బిజినెస్ వాల్యూ రూ. 6 కోట్లు. అంటే రికవరీ 18 శాతం. ఆంధ్రాలో వచ్చిన కలెక్షన్ రూ. 2.27 కోట్ల షేర్. అక్కడ అది చేసిన ప్రి బిజినెస్ రూ. 8.4 కోట్లు. రికవరీ 27 శాతం. అలాగే రాయలసీమలో శ్రీకారం వసూలు చేసిన షేర్ రూ. 72 లక్షలు. అక్కడ ప్రి బిజినెస్ విలువ రూ. 2.4 కోట్లు. రికవరీ 30 శాతం.
తండ్రీ కొడుకులుగా రావు రమేశ్, శర్వానంద్ నటనతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్లు, బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్, మిక్కీ జె. మేయర్ ప్లస్ పాయింట్స్ అయిన 'శ్రీకారం' మూవీ బ్రేకీవెన్ కావాలంటే ఆదివారం వరకు ఈ కలెక్షన్లను సస్టైన్ చేయగలగాలి. మౌత్ టాక్ బాగానే ఉన్నందున ఈ వీకెండ్‌లో మంచి కలెక్షన్లనే ట్రేడ్ వర్గాలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి.
![]() |
![]() |