![]() |
![]() |

నితిన్, కీర్తి సురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రంగ్ దే'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నూతన సంవత్సరారంభం సందర్భంగా రంగ్ దే విడుదల తేదీని నిర్మాత ప్రకటించారు. మార్చి 26న థియేటర్లలో చిత్రం విడుదలవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా థీమ్ మ్యూజిక్‌తో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో నితిన్, కీర్తి డాన్స్, దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, "సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు దర్శకుడు వెంకీ. యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుంది. ఇటీవల 'రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన దృశ్యాలతో కూడిన వీడియో, అలాగే ఓ గీతం బహుళ ప్రేక్షకాదరణ పొందిన విషయం విదితమే." అని తెలిపారు.
సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి. శ్రీరామ్ పనితనం ఈ చిత్రానికి ఎస్సెట్. నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ కీలక పాత్రధారులు. పి.డి.వి. ప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు.

![]() |
![]() |