![]() |
![]() |

యాక్షన్ ఎంటర్టైనర్స్ తో మాత్రమే మాస్ మహారాజా రవితేజ విజయాలను అందుకుంటాడనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే అలాంటి అభిప్రాయాలు తప్పని తన తాజా చిత్రం 'ఈగల్'తో ప్రూవ్ చేస్తున్నాడు రవితేజ.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన సినిమా 'ఈగల్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.30.06 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అసలే ఈమధ్య యాక్షన్ థ్రిల్లర్స్ కి ప్రేక్షకుల కూడా మంచి ఆదరణ లభిస్తుంది. పైగా 'ఈగల్'కి పాజిటివ్ టాక్ వచ్చింది. దానికితోడు ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు. ఈ లెక్కన 'ఈగల్' సినిమా బాక్సాఫీస్ దగ్గర మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.50 నుంచి రూ.60 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, వినయ్ రాయ్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దేవ్ జాంద్ సంగీతం అందించాడు.

![]() |
![]() |