![]() |
![]() |
టాలీవుడ్‌లో ఒక మంచి హీరోగా, అంతకుమించి మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొని రియల్ స్టార్ అనిపించుకున్నారు శ్రీహరి. 49 సంవత్సరాల చిన్న వయసులో కన్నుమూసిన శ్రీహరి.. నటి డిస్కో శాంతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 900 సినిమాల్లో నటించిన డిస్కోశాంతి.. శ్రీహరి మరణం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. శ్రీహరి మరణం ఆమెను ఎంతో కుంగదీసింది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అయితే పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం తిరిగి మామూలు మనిషిగా మారారు శాంతి.
డిస్కో శాంతి సినిమాలకు గుడ్‌బై చెప్పి చాలా కాలం అయింది. ఇప్పుడు ఓ డిఫరెంట్ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. లారెన్స్ సోదరుడు ఎల్విన్ హీరోగా నటించిన ‘బుల్లెట్’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు శాంతి. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ‘ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా తర్వాత నేను సినిమాల్లో కంటిన్యూ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటాను. మా అబ్బాయి మేఘాంశ్‌ని హీరోగా చూడాలన్నది బావ కోరిక. ఆయన వెళ్లిపోయిన తర్వాత ‘రాజ్‌ధూత్’ సినిమాలో మేఘాంశ్ హీరోగా చేశాడు. మంచి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమా అస్సలు బాగాలేదు. థూ.. అది కూడా సినిమాయేనా. నాకు కొంచెం ముందు తెలిసినా సినిమాలో కరెక్షన్స్ చెప్పేదాన్ని. బావ చేసిన చాలా సినిమాలకు అలాంటి కరెక్షన్ చెప్పేదాన్ని. సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ ఎక్కడ అని అడిగాను. అప్పటికే అతను పారిపోయాడు’ అంటూ తన కుమారుడి సినిమా గురించి వివరించారు డిస్కో శాంతి.
![]() |
![]() |