![]() |
![]() |

బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. కొన్ని సినిమాల్లో కూడా నటించారు. 'లీడర్' సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో కూడా కనిపించి అలరించారు. పెళ్లి చేసుకున్న తరువాత ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలలో మాత్రం కనిపించారు. అయితే కొన్నేళ్లక్రితం ఉదయభాను.. డైరెక్టర్ వీరభద్రమ్‌తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై అటు ఉదయభాను కానీ, వీరభద్రమ్ కానీ స్పందించలేదు. ఇన్నేళ్లకు తనపై వచ్చిన రూమర్లపై వీరభద్రమ్ వివరణ ఇచ్చారు.
ఈవీవీ సత్యనారాయణ, తేజ వంటి దర్శకుల వద్ద సహాయక దర్శకుడిగా పని చేసిన వీరభద్రమ్ చౌదరి చాలా కాలం నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఇన్నేళ్ల తన కెరీర్ లో ఆశించిన రీతిలో ఆయన అవకాశాలు పొందలేకపోయారు. 'నువ్వు నేను' సినిమా సమయంలో ఉదయ్ కిరణ్ తో ఓ సినిమా చేయాలనుకున్నానని.. కానీ ఆయనకి పెద్ద బ్యానర్ నుండి పిలుపు రావడంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని వీరభద్రమ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తరువాత అల్లరి నరేష్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని.. ఆయనతో చేసిన 'అహ నా పెళ్లంట' సినిమా వంద రోజులు ఆడిందని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత సునీల్ తో చేసిన 'పూల రంగడు' సినిమా సూపర్ హిట్టయ్యిందని చెప్పారు.
రెండు సినిమాలు హిట్టవడంతో నాగార్జునతో 'భాయ్' సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని.. ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో తన కెరీర్ పై చాలా ఎఫెక్ట్ పడిందని చెప్పారు. ఆ సమయంలోనే యాంకర్ ఉదయభానుతో ఎఫైర్ ఉందంటూ రకరకాల రూమర్స్ వచ్చాయని.. అందులో ఎలాంటి నిజం లేదని వీరభద్రమ్ తెలిపారు. పండ్లున్న చెట్టుకే రాళ్లు వేస్తారని.. తనకి వరసగా రెండు హిట్లు రావడంతో కావాలనే అలాంటి రూమర్లు స్ప్రెడ్ చేశారని చెప్పుకొచ్చారు. నిజానికి ఉదయభానుని ఎప్పుడూ కలవలేదని.. అలాంటిది ఇద్దరికీ ఎఫైర్ అంటూ వార్తలు ఎలా పుట్టాయో అర్థం కాలేదని అన్నారు.
![]() |
![]() |