![]() |
![]() |

బాలీవుడ్ కోర్ట్ డ్రామా `పింక్` ఆధారంగా రూపొందిన `వకీల్ సాబ్`తో రి-ఎంట్రీ బాట పట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏప్రిల్ 9న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ మూటగట్టుకున్న ఈ రీమేక్.. ఆరంభ వసూళ్ళతో బాక్సాఫీస్ ని షేక్ చేసినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా ఆ తరువాత మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయింది. కట్ చేస్తే.. ఏప్రిల్ 30 నుంచి `అమెజాన్ ప్రైమ్`లో స్ట్రీమ్ అవుతున్న `వకీల్ సాబ్`కి వీక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఇదిలా ఉంటే.. `వకీల్ సాబ్` తరువాత పవన్ నుంచి రాబోయే కొత్త సినిమా కూడా రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం విదితమే. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా రూపొందుతున్న ఈ మల్టిస్టారర్ లో దగ్గుబాటి రానాతో కలిసి నటిస్తున్నారు పవన్. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ డ్రామా.. సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. కాగా, విజయదశమి కానుకగా ఈ భారీ బడ్జెట్ మూవీని విడుదల చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చుతున్నారు.
![]() |
![]() |