![]() |
![]() |

ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి కారణం ఒక డిస్ట్రిబ్యూటర్. అసలు వివరాల్లోకి వెళితే... రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'దర్బార్'. రజనీ మురుగదాస్ కాంబినేషన్లో కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది. సినిమా అంచనాలను చేరుకోలేదు అనడం కన్నా మురుగదాస్ అంచనాలకు తగ్గట్టు సినిమా తీయలేదు అనడం కరెక్టేమో. రజని ఇమేజ్ మీద ఆధారపడి సన్నివేశాలు రూపొందించాడు గాని కథ, ఈ కథనాలపై సరైన దృష్టి పెట్టలేదని విమర్శలు వచ్చాయి. వసూళ్ళ పరంగానూ సినిమా నిరాశ పరిచింది. దాంతో తమిళనాడుకు చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్ మురుగదాస్ ను డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టారట! 'నీ వల్లే నా డబ్బులు పోయాయి. నేను లాస్ అయ్యాను' అని గొడవ చేస్తున్నారట. దాంతో తనకు రక్షణ కల్పించమని మద్రాస్ హైకోర్టును మురుగదాస్ ఆశ్రయించారు. అదీ సంగతి!
![]() |
![]() |