![]() |
![]() |
.jpg)
విభిన్న షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తోన్న 'తెలుగు వన్' సంస్థ నుండి మరో విభిన్న వెబ్ సిరీస్ రాబోతోంది. తెలుగు వన్ అధినేత కంఠంనేని రవిశంకర్ గారి నిర్మాణంలో 'ఇన్ స్పెక్టర్స్' అనే వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. దీనికి సురేష్ రాజ్ భోగమోని దర్శకత్వం వహించనున్నారు. 'దారి', 'తెలుగు మాష్టారు' షార్ట్ ఫిల్మ్స్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సురేష్ రాజ్.. ఇప్పుడు 'ఇన్ స్పెక్టర్స్' అనే భిన్న వెబ్ సిరీస్ తో రాబోతున్నారు.
హర శ్రీనివాస్, ప్రణీత శేఖర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ ముహూర్త సన్నివేశం.. గురువారం నాడు 'తెలుగు వన్' ఆఫీస్ వద్ద చిత్రీకరించడం జరిగింది. కంఠంనేని రవిశంకర్ క్లాప్ కొట్టగా, సుబ్రహ్మణ్యం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. కాగా, ఈ 'ఇన్ స్పెక్టర్స్' వెబ్ సిరీస్ షూటింగ్ శుక్రవారం నుండి ప్రారంభం కానుంది.

![]() |
![]() |