![]() |
![]() |
.jpg)
కుటుంబంతో కలిసి కొన్ని రోజులు సరదాగా గడపడం కోసం సినిమా సెలబ్రిటీలు అందరూ క్యూ కట్టేది మాల్దీవులకే! పెళ్లయిన తర్వాత కాజల్ అగర్వాల్ హనీమూన్ ట్రిప్ అక్కడికే వేశారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల హనీమూన్ ట్రిప్ కూడా మాల్దీవులకే! పెళ్ళికాని తారలో స్నేహితులతో కలిసి వెళ్తున్నారు. ఇటీవల స్టార్ యాంకర్ సుమ కనకాల పిల్లలతో కలిసి వెళ్లారు.
మాల్దీవులకు వెళ్లిన సెలబ్రిటీల జాబితాలోకి తాజాగా ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు కుమార్తె హన్షితా రెడ్డి చేరారు. భర్త, పిల్లలతో కలిసి మాల్దీవులు వెళ్లారామె. సముద్రతీర ప్రాంతంలో... షికారు చేస్తున్నారు. జలకాలాటలలో సేద తీరుతున్నారు. హన్షిత కుటుంబంతో పాటు ఆమె బాబాయ్ శిరీష్ కుటుంబం కూడా వెళ్లింది. అందరూ కలిసి సముద్ర జలాలపై షికారు చేస్తున్న ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.
.jpg)
సినిమాలకు వస్తే... 'దిల్' రాజు బాటలో నడుస్తూ హన్షితా రెడ్డి కూడా చిత్రనిర్మాణంలోకి వచ్చారు. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా నిర్మాణ వ్యవహారాలను గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ, దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి చూసుకున్నారు.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
![]() |
![]() |