![]() |
![]() |

సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చి దాదాపు ఆరేళ్ళు అవుతుంది. అందుకే ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'దేవర' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ నుంచి వస్తున్న తదుపరి సినిమా కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ తేదీకి సినిమా రావడంలేదు.
ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం తీసుకున్న దేవర టీం.. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ ని మొదలుపెట్టి, మెజారిటీ షూటింగ్ ని చాలా వేగంగా అనుకున్న టైంకి పూర్తి చేశారు. అయితే షూటింగ్ చివరి దశకు చేరుకున్న సమయంలో కొన్ని అనుకోని షాక్ లు తగిలాయి. ఇందులో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ గాయపడటంతో షూటింగ్ కి కాస్త బ్రేక్ వచ్చింది. అలాగే వీఎఫ్ఎక్స్ తో ముడిపడి ఉన్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో.. పోస్ట్ ప్రొడక్షన్ కి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోంది. దానికితోడు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉండటంతో.. అనిరుధ్ అనుకున్న టైంకి పాటల రికార్డింగ్ పూర్తి చేయలేకపోతున్నాడు అంటున్నారు. ఇలా పలు కారణాల వల్ల ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన దేవర.. కొత్త తేదీని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అనుకున్న తేదీకి దేవర రావడంలేదని ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉండటంతో.. వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి అభిమానులను ఖుషీ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. సైఫ్ అలీ ఖాన్ కూడా కోలుకోవడంతో.. మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టడం కోసం దేవర టీం రంగంలోకి దిగుతుందట. ఫిబ్రవరి 16 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ పాల్గొననున్న ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తవుతుందట. ఈలోపు సాంగ్స్ కూడా రెడీ అయితే.. వీలైనంత త్వరగా వాటి చిత్రీకరణ కూడా పూర్తి చేయాలని ఎన్టీఆర్, కొరటాల చూస్తున్నారట. దేవర పార్ట్-1 ని ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేసవి కల్లా దేవర షూటింగ్ పూర్తి చేసి.. బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో బిజీ కావాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో పాటు 'దేవర-2' లైన్ లో ఉన్నాయి.
![]() |
![]() |