![]() |
![]() |

బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ నాన్‌వెజ్ లవర్. చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్... ఆల్మోస్ట్ నాన్‌వెజ్‌లో అన్ని వెరైటీలు టేస్ట్ చేసినోడు. ముంబైలోని నూర్ మహ్మద్ హోటల్‌లో సంజయ్ దత్ పేరు మీద 'చికెన్ సంజు బాబా' అని ఒక డిష్ మెనూలో యాడ్ చేశారంటే... అతడికి మాంసాహారం మీద ఎంత ప్రేమ అనేది అర్థం చేసుకోండి. అన్నట్టు... 'చికెన్ సంజు బాబా' సిగ్నేచర్ డిష్ సృష్టికర్త అతడే. అటువంటి సంజయ్ దత్, లాక్ డౌన్ పీరియడ్‌లో సడన్‌గా వెజిటేరియన్‌గా మారాడని సమాచారం.
ప్రస్తుతం సంజయ్ దత్ నాన్‌వెజ్ తినడం లేదనీ, కంప్లీట్ వెజ్ తింటున్నాడనీ ముంబై ఖబర్. అతడు పూర్తి శాకాహారిగా మారితే అది విశేషమే. వెజ్‌లో వెరైటీలు టేస్ట్ చేయడం సంజయ్ దత్ స్టార్ట్ చేశాడట. అయితే... భవిష్యత్తులో నాన్‌వెజ్ ముట్టుకోకపోవచ్చట. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న సంజు బాబా, దూరదర్శన్ ఛానల్‌లో రామాయణ్, మహాభారత సీరియల్స్ చూస్తున్నారట. అతడు ముంబైలో ఉంటే, ఫ్యామిలీ దుబాయ్ లో చిక్కుకుంది. ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్ క్యాన్సిల్ చేయడంతో సంజయ్ దత్ వైఫ్ మాన్యత, పిల్లలు షాహారాన్, ఇక్రా అరబ్ దేశంలో ఉన్నారు.
![]() |
![]() |