![]() |
![]() |
.webp)
-కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-మన శంకర వర ప్రసాద్ పై వచ్చిన జీవో లో ఏముంది
-నా సంతకం లేదు
-చెయ్యను కూడా
సినీ రంగం అనేది ఒక పరిశ్రమ లాంటిదే అనే విషయం తెలిసిందే. కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా సినీ పరిశ్రమపై ఆధార పడి తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందుకే సంబంధిత సినీ రంగానికి సుదీర్ఘ కాలం నుంచే రాష్ట్ర ప్రభుత్వాల చేత సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఉంటుంది. కేంద్ర స్థాయిలో కూడా సంబంధిత శాఖ ఉంటుంది. ఈ శాఖ ద్వారా సినీ రంగంలో కార్మికులు ఎదుర్కుంటున్న పలు సమస్యలతో పాటు, సినిమాకి సంబంధించిన పలు ఇతర విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. దీన్ని బట్టి ఆ శాఖ కి ఉన్న ప్రాముఖ్యత అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇప్పడు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(KOmatireddy Venkata Reddy)చెప్పిన మాటలు వైరల్ గా నిలిచాయి.
ఆయన మాట్లాడుతు పుష్ప 2(Pushpa 2)ఘటనలో మహిళ చనిపోయిన తర్వాత ఎలాంటి చిత్రాలకి బెనిఫిట్ షో తో పాటు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి నేను పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటి వాటి గురించి అడగడానికి నా వద్దకు రావద్దని అసెంబ్లీ సాక్షిగానే వెల్లడి చేశాను. ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమా, రాబోతున్న సినిమాల విషయంలో కూడా అదే మాటకి కట్టుబడి బెనిఫిట్ షో,టికెట్ పెంపు కి పర్మిషన్ ఇస్తు సంతకం చెయ్యలేదు. అసలు సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడమే మానేసాని చెప్పడం జరిగింది.
Also read: ది రాజా సాబ్ రిజల్ట్ పై అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే
నిన్న విడుదలైన ది రాజాసాబ్(The Raja saab)ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెంచినట్టుగా ఇచ్చిన జీవో ప్రకారం పెరిగిన టికెట్ రేట్స్ తో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 12 న వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారి(Mana shankara Varaprasad Garu)కి కూడా మొదటి వారం రోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకోవడంతో పాటు 11 రాత్రి బెనిఫిట్ షో కి అనుమతి ఇస్తు తెలంగాణ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ నుంచి ఈ రోజు ఉదయం అధికార జీవో వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
![]() |
![]() |