![]() |
![]() |

మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన సఖి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటుడు మాధవన్. 2000 వ సంవత్సరం లో వచ్చిన ఆ మూవీ మాధవన్ కి తెలుగులో ఎంతో మంది అభిమానులని సంపాదించిపెట్టింది. ఆ రోజుల్లో మాధవన్ నవ్వుకే ఫ్లాట్ అయిపోయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. కెరీర్ పరంగా ఫుల్ బిజీ గా ఉన్న మాధవన్ తాజాగా పెళ్లి అయిన ఒక హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు టాక్ అఫ్ ది ఫిలిం ఇండస్ట్రీ అయ్యాయి
మాధవన్ తాజాగా ది రైల్వే మెన్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇందులో ఒకప్పటి బాలీవుడ్ అగ్ర కధానాయిక జుహీచావ్లా కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మాధవన్ మాట్లాడుతు నేను జుహీచావ్లా నటించిన ఖయామత్ సే ఖయామత్ సినిమా చూసి మా అమ్మ దగ్గరకి వెళ్లి నేను పెళ్లంటూ చేసుకుంటే జుహీచావ్లా నే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అసలు ఆ రోజుల్లో నాకున్న ఏకైక లక్ష్యం జుహీచావ్లాని పెళ్లి చేసుకోవడమే అని మాధవన్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

టీవీ షో ల ద్వారా తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించిన మాధవన్ ఆ తర్వాత తెలుగు,తమిళ మలయాళ,కన్నడ, హిందీ భాషలకి చెందిన ఎన్నో సినిమాల్లో అధ్బుతంగా నటించి ప్రేక్షకుల్లో మంచి పేరుని సంపాదించాడు. తన ఎన్నో సినిమాలకి కాస్ట్యూమర్ డిజైనర్ గా పని చేసిన సరితా బిర్జిని మాధవన్ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి 1999 లో వివాహం జరిగింది.
![]() |
![]() |