![]() |
![]() |
.webp)
అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పుష్ప: ది రూల్'(Pushpa: The Rule). 'పుష్ప: ది రైజ్'కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది.
'పుష్ప 2' నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి, గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ రాబోతుందట. సంక్రాంతికి మేకర్స్ బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. పోస్టర్ తో పాటు ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేయనున్నారట. అదే జరిగితే ఈ సంక్రాంతి మరింత సందడిగా మారుతుంది అనడంలో సందేహం లేదు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna), ఫహాద్ ఫాజిల్, సునీల్ తదితరులు నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |