![]() |
![]() |
.webp)
నందమూరి బాలకృష్ణ(balakrishna)అప్ కమింగ్ మూవీకి 'డాకు మహారాజ్'(daku maharaj)అనే టైటిల్ ని ఫిక్స్ చెయ్యడం జరిగింది.ఈ మేరకు మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావడంతో పాటు టీజర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. టీజర్ చూసిన బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా బాలయ్య ఖాతాలో మరో హిట్ చేరడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జనవరి 12 న రిలీజ్ కాబోతున్న ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫోర్చ్యున్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.రవితేజ, ఎన్టీఆర్, చిరంజీవి తో హిట్ చిత్రాలని తెరకెక్కించిన బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక టీజర్, ట్రైలర్ రిలీజ్ సందర్భంగా చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది, అందులో ఒక విలేకరి బాబీ(bobby)తో చిరంజీవి గారితో సినిమా తెరకెక్కించినప్పుడు చిరంజీవి గారి అభిమానిలా మారిపోతారు. ఇపుడు బాలకృష్ణ గారితో సినిమా తెరెక్కిస్తున్నారు కాబట్టి బాలకృష్ణ గారి అభిమానిలా మారిపోయారా అని అడిగాడు. అప్పుడు బాబీ మాట్లాడుతూ ఏ హీరో తో సినిమా చేస్తుంటే ఆ హీరో నే మాకు దైవం, సర్వసం. ఇక వాళ్లనే ఫాలో అవుతూ ఉంటాం. గతంలో రవితేజ,ఎన్టీఆర్ తో సినిమా చేసినప్పుడు కూడా అదే ఫీలింగ్ తో ఉంటానని చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |