![]() |
![]() |
.webp)
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)అప్ కమింగ్ మూవీ విశ్వంభర(vishwambhara)ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ చిరు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా,నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబి సార వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన వశిష్ఠ(vasishta)దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.యువీ క్రియేషన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.
అందులో భాగంగా ఇప్పుడు సాంగ్స్ చిత్రీకరణ జరుపుకోనుంది.ఎల్లుండి నుంచి జపాన్ లో చిరంజీవి,త్రిష(trisha)ల పై ఒక డ్యూయట్ ని తెరెకెక్కించనున్నారు.ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం జపాన్ వెళ్లనుంది.అక్కడ నుంచి వచ్చాక హైదరాబాద్ లో చిరంజీవి ఇంట్రడక్షన్ ని సంబంధించిన ఒక సాంగ్ ని చిత్రీకరించన్నారని తెలుస్తుంది.
.webp)
కీరవాణి సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న విశ్వంభర లో ఆషికా రంగనాద్, ఇషా చావ్లా,కునాల్ కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండగా చోట కె నాయుడు కెమెరా బాధ్యతలని అందిస్తున్నాడు.మూవీ రిలీజ్ జనవరి 10 నుంచి వాయిదా పడిన విషయం తెలిసిందే.
![]() |
![]() |