![]() |
![]() |

బిగ్ బాస్ 4 సీజన్ లో వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున రాక కోసం బిగ్ హౌస్ లోని 16 మంది సభ్యులతో పాటు లక్షలాది మంది ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూశారు. "హౌస్ లో కట్టప్ప ఉన్నాడు" అంటూ క్యూరియాసిటీ క్రియేట్ చేసిన నాగార్జున అందుకు తగ్గట్టుగానే 'బాహుబలి' సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. హౌస్ సభ్యులంతా ముస్తాబై గ్లామర్ గా కనిపించారు. స్క్రీన్ పై నాగార్జున కనిపించగానే హౌస్ సభ్యులంతా విష్ చేశారు. కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రి ఇచ్చాక వారందరినీ నాగార్జున పలకరించడం ఇదే మొదటిసారి. ఆయన అందరినీ పేరుపేరునా పలుకరించారు. అయితే గంగవ్వ మాత్రం నాగార్జున కనిపించగానే కాస్త ఎమోషనల్ అయ్యారు.
"గంగవ్వ ఎలా ఉన్నావు.. బాగా ఆడుతున్నావా?" అని అని నాగ్ అడిగారు.
"నాకు నిద్ర పట్టడం లేదు. ఎక్కువ రోజులు ఉండలేను" అన్నారు గంగవ్వ. తన భావోద్వేగాన్ని కొనసాగిస్తూ "పెద్దన్న బిగ్ బాస్, చిన్నన్న నాగార్జున సార్.." అంటూ తనదైన స్టైల్ లో పాట పాడి వినిపించారు.
అయితే తెలంగాణ యాసలో గంగవ్వ మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప అర్థం కావు అన్న విషయాన్ని నాగార్జున గుర్తు చేశారు. "నువ్వు చాలా బాగా ఆడుతున్నావు కానీ కాస్త నెమ్మదిగా మాట్లాడితే బాగుంటుంది.. కొన్ని నాకే కాదు ప్రేక్షకులకు కూడా అర్థం కావడం లేదు, సుజాతా అవ్వకు కాస్త సహాయంగా ఉండు" అని సూచించారు.
"బిగ్ బాస్ సార్ కు, నాగార్జున సార్‌కు చెప్పి వెళ్లిపోతా అని అంటున్నావు. అదేమీ కుదరదు. నువ్వు ఇక్కడే ఉండాలి. నిన్ను పంపించేది నేను కాదు ప్రేక్షకులే.. వాళ్ళతో మాట్లాడుకో." అంటూ గంగవ్వకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
నిజానికి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా కనిపించే గంగవ్వ హౌస్ లో ఉండటం ప్రేక్షకులకు ఎంత ముఖ్యమో రేటింగ్ పరంగా బిగ్ బాస్ కు కూడా అంతే ముఖ్యం. అందుకే సాధ్యమైనంత వరకు ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఆమెను ఎక్కువ రోజులు హౌస్ లో ఉంచే ప్రయత్నం చేస్తారు.. అనేది ఈ ఎపిసోడ్ తో అర్థం అయిపోయింది.
![]() |
![]() |