![]() |
![]() |
ఈమధ్యకాలంలో సినిమా సెలబ్రిటీలతో సమానంగా టీవీ నటీనటులకు, యాంకర్లకు ఫాలోయింగ్ ఉంటోంది. ఎక్కడికి వెళ్లినా వీరిని కూడా సినిమా వాళ్ళతో సమానంగా ఆదరిస్తున్నారు. టీవీ ప్రోగ్రామ్స్‌కి సంబంధించి యాంకర్ ప్రదీప్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. సుమకు ఎంత క్రేజ్ ఉందో, ప్రదీప్ కూడా అంత క్రేజ్ తెచ్చుకున్నాడు. యాంకర్‌గా మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడే ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే సినిమా చేశాడు. ప్రేక్షకులు అతన్ని యాంకర్‌గానే చూశారు తప్ప హీరోగా రిసీవ్ చేసుకోలేకపోయారు. హీరో అవ్వాలనే తన ఆలోచన బెడిసికొట్టడంతో మళ్ళీ టీవీ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టాడు.
ఢీ షో నుంచి ప్రదీప్ తప్పుకున్న విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా ఈ షోను నిర్వహిస్తున్నాడు ప్రదీప్. సడన్‌గా ఈ షో నుంచి వెళ్లిపోవడం వల్ల టీవీ కార్యక్రమాలకు దూరమయ్యాడు. ప్రస్తుతం టీవీల్లో రిపీటెడ్‌గా వచ్చే షోలలో మాత్రమే కనిపిస్తున్నాడు. ప్రదీప్ సడన్‌గా కనుమరుగు అవ్వడానికి కారణాలు ఏమిటి అని అభిమానులు ఆలోచిస్తున్నారు. మరోసారి హీరోగా ట్రై చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రదీప్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేశాడు. కండలు తిరిగే శరీరం కోసం ప్రదీప్ ఎంతగా కష్టపడుతున్నాడో జిమ్ ట్రైనర్ వివరించాడు.
ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న ప్రదీప్ ఒక్కసారిగా ఆ వీడియోను రిలీజ్ చేయడంతో ఆ వీడియోను చూసిన వారు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. అన్నా.. మనకు సినిమాలు అవసరమా.. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు, ఇలా వర్కవుట్ చేసి బాడీ పెంచడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.. ఇలా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మరికొందరు.. జిమ్ చేసేటపుడు కూడా విగ్ వదలడం లేదు అని అంటూ ట్రోల్ చేస్తున్నారు.
![]() |
![]() |