![]() |
![]() |

ప్రపంచ సినీ ప్రేక్షకుల తపస్సు ఫలించి నిన్న దర్శక, రచయిత క్రిస్టోఫర్ నోలన్ అద్భుత సృష్టి ;ది ఒడిస్సీ' వరల్డ్ సెల్యులాయిడ్ పై అడుగుపుట్టింది. ప్రపంచ సినీ ప్రేమికులకి దీటుగా తెలుగు ప్రేక్షకులు కూడా ఉదయం ఎనిమిది గంటల ఆట నుంచే పెద్ద ఎత్తున పోటెత్తారంటే ది ఒడిస్సీ క్వాలిటీ యొక్క సునామిని అర్ధం చేసుకోవచ్చు. కథాంశం, నటీనటుల నటన, కళ్ళు చెదిరే వీఎఫ్ఎక్స్ శైలి గురించి ప్రేక్షకులు, సినీ విమర్శకులు గొప్పగా మాట్లాడుకుంటున్నారు.
అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా భారతీయ ప్రేక్షకులలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. హోమర్ రాసిన గ్రీకు పురాణగాథ 'ది ఒడిస్సీ' ఆధారంగా ఈ సినిమా రూపొందినప్పటికీ, ఇందులో మన భారతీయ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాలకు సంబంధించిన బలమైన పోలికలు ఉన్నాయంటూ నెటిజన్లు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. ముఖ్యంగా 'హోమ్‌కమింగ్' అంటే స్వదేశానికి తిరిగి రావడం అనే అంశం నేరుగా రామాయణాన్ని తలపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. లంకలో రావణాసురుడిని సంహరించి, సుదీర్ఘ పోరాటం,వనవాసం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యకి తిరిగి రావడం, అక్కడ ప్రజలు ఘనస్వాగతం పలకడం మనకు తెలిసిందే. సరిగ్గా ఇదే తరహాలో నోలన్ 'ది ఒడిస్సీ' హీరో కూడా ఎన్నో కష్టాలు, సవాళ్లు, రాక్షసులతో సుదీర్ఘ కాలం పోరాడి, చివరకి తన సొంత రాజ్యానికి, భార్య వద్దకి చేరుకుంటాడు.
Also read: నాని ది ప్యారడైజ్ నైజాం హక్కుల సంచలనం
ఈ రెండు కథల్లోని ప్రధాన క్యారెక్టర్స్ ప్రయాణం, వారి అంతర్గత సంఘర్షణ ఒకేలా సాగడం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరో ప్రధానమైన సారూప్యత 'దైవిక మార్గదర్శకత్వం' (Divine Guidance). మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు 'భగవద్గీత' బోధించి, ప్రతి అడుగులోనూ మార్గదర్శిగా నిలిచి విజయం వైపు నడిపించాడు. రామాయణంలోనూ శ్రీరాముడికి సముద్రుడిని దాటడానికి, లంకని చేరడానికి ఎందరో దైవాంశ సంభూతులు సాయపడ్డారు. ఈ చిత్రంలో కూడా ఒడిస్సియస్ తన సుదీర్ఘ ప్రయాణంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల నుండి గట్టెక్కడానికి గ్రీకు దేవతల అదృశ్య హస్తం, దైవిక శక్తుల సహాయం లభిస్తుంది. ఈ రకమైన అతీత శక్తుల ప్రమేయం, కథానాయకుడిని సరైన మార్గంలో నడిపించే విధానం మన పురాణాల స్ఫూర్తిని గుర్తుచేస్తోందని నెటిజన్లు ట్వీట్ల ద్వారా వివరిస్తున్నారు.చివరగా, కథలో వచ్చే ట్విస్ట్‌లు నైతిక విలువలు కూడా మన ఇతిహాసాలకు దగ్గరగా ఉన్నాయి. అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని, మానవ జీవితంలోని నైతిక విలువలను ఈ చిత్రం అద్భుతంగా ఆవిష్కరించింది. కేవలం వెస్ట్రన్ పురాణాలకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇతిహాసాల మూలాలు ఒకేలా ఉంటాయని నోలన్ తన మేకింగ్ ద్వారా మరోసారి నిరూపించారు. అందుకే ఈ సినిమాపై ప్రస్తుతం ఇండియన్ సోషల్ మీడియా సర్కిల్స్ లో 3 ప్రధాన సారూప్యతలతో కూడిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ప్రపంచ స్థాయి సినిమా మేకింగ్‌లో మన భారతీయ సంస్కృతి, ఇతిహాసాల ఛాయలు కనిపించడం నిజంగా ప్రతి ఒక్కరికీ గర్వకారణం.
The odyssey, ChristopherNolan, ramayana, mahabharata
![]() |
![]() |