![]() |
![]() |
.jpg)
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్' షూటింగ్ మొత్తం పాటలతో సహా పూర్తయి, సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలకు రెడీ అవుతోంది. నూతన సంవత్సరం పురస్కరించుకొని ‘క్రాక్’ ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ చూస్తుంటే రవితేజ ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉంది.
"చూశారా.. జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ.. గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయ్.. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే.. ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే ఒక పోలీసోడూ.." అంటూ విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలైంది. రెండు నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్‌లో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా అడుగడుగునా రవితేజ వీరవిహారం కనిపిస్తోంది. దాంతోపాటు డైరెక్షన్, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ 'క్రాక్'కు ఎట్రాక్షన్ కానున్నాయని తెలుస్తోంది.
"శంకర్.. పోతరాజు వీరశంకర్.."
"ష్యూర్ షాట్.. నో డౌట్.. పుచ్చె పేలిపోద్ది.."
"ఒంగోలు నడిరోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా నా కొడకా.."
"కాసేపాగితే నా మూడెలాగుంటుందో, ఏది కట్ చేస్తానో నాక్కూడా తెలీదు.."
"చిన్న బ్రేకిచ్చా.. ఈ గ్యాప్‌లో ఎన్ని యాడ్‌లేసుకుంటావో యేస్కో.. సీ యు సూన్.. కలుద్దాం మరి.." అంటూ సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ మాస్ మహారాజా నోటి వెంట వింటున్న ప్రేక్షకులు రేపు థియేటర్లలో ఈలలు వేయకుండా ఉంటారా!
శ్రుతి హాసన్ హీరోయిన్‌గా గ్లామర్ పంచిన ఈ సినిమాలో సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్, రవిశంకర్ విలన్లుగా కనిపించనున్నారు. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఇంటెన్సిటీతో ఆకట్టుకుంటోందో, జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అంత ఇంప్రెసివ్‌గా ఉంది. రామ్-లక్ష్మణ్ ఫైట్స్ గురించి చెప్పాల్సిందేముంది. వాళ్లు మరోసారి దున్నేసినట్లు అర్థమవుతోంది.
ఇక సినిమాను జనవరి 14న విడుదల చేస్తామని ప్రకటించిన చిత్రబృందం.. తాజాగా విడుదల తేదిని ముందుకు జరిపింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని దర్శకుడు గోపిచంద్ మలినేని వెల్లడించారు. 'డాన్ శీను', 'బలుపు' సినిమాలతో హిట్ కొట్టిన రవితేజ, గోపీచంద్ ద్వయం 'క్రాక్'తో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ట్రైలర్ తేల్చేసింది.
![]() |
![]() |