![]() |
![]() |

కర్ణాటకలో పట్టపగలే ఓ నటుడు దారుణంగా హత్యకు గురయ్యారు. బుధవారం మధ్యహ్నం తుళు నటుడు సురేంద్ర బంట్వాల్‌ను గుర్తు తెలీని వ్యక్తులు హత్య చేశారు. ఆయనకు రౌడీ నేపథ్యం ఉంది. సురేంద్ర మీద పోలీసులు రౌడీ షీట్ కూడా తెరిచారట. కన్నడ, తుళు చిత్రాల్లో నటించిన సురేంద్రకు కొందరితో ఆర్థిక లావాదేవీల సమస్యలు ఉన్నాయని, ఆ కారణం చేతనే ఆయనను హత్యచేసి ఉండవచ్చనేది ప్రాథమిక సమాచారం. అసలు వివరాల్లోకి వెళితే...
కర్ణాటకలోని బంట్వాల్‌లో ఉన్న బీసీ రోడ్డులో సురేంద్ర నివాసం ఉంటున్నారు. ఆయన అపార్టుమెంట్‌లో ఉండగా, కొందరు దుండగులు వచ్చి హత్య చేసినట్టు సమాచారం. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. గతంలో బీజేపీ నాయకులను బెదిరించిన కేసులో సురేంద్ర జైలుకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవలే బెయిల్ మీద విడుదలయ్యారట. ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తుళు సినిమా ‘ఛలి పొలిలు’, కన్నడ సినిమా ‘సవర్ణ దీర్ఘ సంధి’లో సురేంద్ర నటించారు.
![]() |
![]() |