![]() |
![]() |

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రానున్న ఓ వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ లీడ్ పోషించనున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమెరికన్ టీవీ సిరీస్ 'క్వాంటికో'కు ఈ వెబ్ సిరీస్ రీమేక్ అనేది ఆ వార్తల సారాంశం. 'క్వాంటికో' అనగానే మనకు ప్రియాంకా చోప్రా గుర్తుకు రావడం ఖాయం. అవును. ఆమె చేసిన 'క్వాంటికో' టీవీ సిరీస్ రీమేక్‌లో కాజల్ నటించనున్నదన్న మాట. ప్రియాంక చేసిన క్యారెక్టర్‌ను కాజల్ చేయనున్నదనే ప్రచారంతో ఆమె ఫ్యాన్స్ ఎక్జైట్ అవుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నదంట.
ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఇంకో విషయం.. ఇది కేవలం ఒక్క భాషలో కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజవనున్నదని తెలుస్తోంది. ఇది కూడా కన్‌ఫామ్ కావాల్సి ఉంది. 2021లో ఇది రిలీజ్ కానున్నది. సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి సినిమా 'ఆచార్య'లో, కమల్ హాసన్ సినిమా 'భారతీయుడు 2'లో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. 'క్వీన్' రీమేక్ 'పారిస్ పారిస్' త్వరలో ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదలవనున్నదని వార్తలు వస్తున్నాయి.
![]() |
![]() |