![]() |
![]() |

కొన్ని చిత్రాల రాక కోసం సౌత్ సినీ ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి ఒక చిత్రమే 'ఆకాశంలో ఒక తార'. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి,శ్రుతి హాసన్ కీలక పాత్రలు కాగా పవన్ సాదినేని దర్శకుడు. ఈ రోజు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు మొదటి సింగిల్ 'చిట్టి చిట్టి చీమ' పాటని అధికారికంగా విడుదల చేశారు.
జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ 'చిట్టి చిట్టి చీమ' పాట సంగీతాభిమానుల హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రముఖ గీత రచయిత శ్రీమణి అందించిన సాహిత్యం పాటలోని అంతరార్థాన్ని ఎంతో లోతుగా ఆవిష్కరించింది. "చిగ్గ రాని చోట మొలకెత్తే విత్తనంలా, ఆకాశాన్ని తాకాలనే చిన్న చీమ సంకల్పంలా" ఉండే భావాలు ఎంతో మధురంగా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి. గాయని నిత్య మామ్మన్ తన మధురమైన గొంతుతో ఈ మెలోడీకి ప్రాణం పోసింది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ పాట తమిళంలో 'మిట్టాయి మళై', మలయాళంలో 'కుట్టి కుట్టి పువే', హిందీలో 'సన్ సన్ హవా' పేరుతో శ్రోతలని మంత్రముగ్ధులని చేస్తోంది.
Also read: ఆ హీరో వల్లనే నాకు పేరు వచ్చింది.. బాలకృష్ణ మాత్రం
ఈ పాట వీడియో గ్లింప్స్‌లో దర్శకుడు పవన్ సాదినేని ఎమోషన్స్‌ను ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. చిన్ననాటి కలలు, గ్రామీణ వాతావరణం, దుల్కర్ సల్మాన్ చూపించిన సహజమైన అభినయం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. రాక్షస పరిమాణంలో ఉన్న సమస్యల ముందు ఒక చిన్న చీమలాంటి మనిషి తన అసాధ్యమైన కలను ఎలా సాకారం చేసుకుంటాడు అనే ప్రేరణాత్మకమైన కథాంశం ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తుంది. దుల్కర్, సాత్వికల మధ్య ఉన్న ఆత్మీయమైన బాండింగ్, విజువల్స్ సినిమాపై అంచనాలని ఒక్కసారిగా పెంచేశాయి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం కచ్చితంగా ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుందని అభిమానులు నమ్ముతున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. సందీప్ గుణ్ణం మరియు రమ్య గుణ్ణం కూడా నిర్మాతలుగా ఉన్నారు.
Aakasamlo oka tara, Dulquer Salmaan,Satvika Veeravalli,Pavan Sadineni,
![]() |
![]() |