![]() |
![]() |
కన్నడ నాట మొదలై పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న నటుడు రాకింగ్ స్టార్ యష్. 'KGF' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం తన తర్వాతి చిత్రం ‘టాక్సిక్’ (Toxic) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి, ముఖ్యంగా దర్శకురాలి మేకింగ్ స్టైల్ గురించి యష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా గ్యాంగ్‌స్టర్ డ్రామాలు అంటేనే రఫ్ అండ్ టఫ్ యాక్షన్, భారీ డైలాగులు ఉంటాయని అందరూ అనుకుంటారు. ఇలాంటి కథలను పురుష దర్శకులు మాత్రమే సమర్థవంతంగా తెరకెక్కించగలరనే అపోహను ‘టాక్సిక్’ చెరిపివేస్తుందని యష్ ధీమా వ్యక్తం చేశారు. ఒక మహిళా దర్శకురాలి కోణంలో గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని చూడటం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సినిమాలో రొమాంటిక్ సీన్స్ నుంచి హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ వరకు ప్రతిదీ ‘ఫీమేల్ గేజ్’ (మహిళా దృక్పథం) లో చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లు యష్ స్పష్టం చేశారు.
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పనితీరును ప్రశంసిస్తూ.. ఆమె ఒక అద్భుతమైన రచయిత్రి అని, ఆమెతో కలిసి పనిచేస్తున్న సమయంలో తాను ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటున్నానని యష్ తెలిపారు. యాక్షన్ సీన్లలో ఉండే ఆవేశాన్ని ఎంత బలంగా చూపించారో, అంతే సున్నితంగా ఎమోషన్స్‌ను కూడా ఆమె పండించారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ప్రేక్షకులు చూసి ఉండరని, మేకింగ్ పరంగా సరికొత్త ఒరవడిని ఈ సినిమా సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో యష్ సరసన ఏకంగా ఐదుగురు భామలు కనిపించబోతున్నారనే వార్త ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం చిత్ర యూనిట్ అహర్నిశలు శ్రమిస్తోంది. 'KGF' తర్వాత యష్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో దేశవ్యాప్తంగా సినీ లవర్స్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గీతూ మోహన్ దాస్ గత చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో, ‘టాక్సిక్’ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు క్వాలిటీ సినిమాగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ‘టాక్సిక్’ షూటింగ్ దశలో ఉంది. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది మార్చిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుండటంతో, మూవీ విడుదల తేదీని జూన్ 4వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. ఈ గ్యాప్‌లో మరిన్ని అప్‌డేట్స్ తో రాకింగ్ స్టార్ తన ఫ్యాన్స్ ను పలకరించనున్నారు. రాబోయే టీజర్ మరియు ట్రైలర్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.
![]() |
![]() |