![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కలయికలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' చేస్తున్న అల్లు అర్జున్, ఆ తర్వాత లోకేష్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై ప్రముఖ రచయిత రత్నకుమార్ స్పందిస్తూ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
"ఇది అంతర్జాతీయ ఆడియన్స్ ను మెప్పించేంత గొప్ప కథ. ఈ సినిమా కోసం మూడు వారాల పాటు చర్చలు జరిగాయి. అల్లు అర్జున్ గారితో మాట్లాడడం మా టీమ్‌కు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. మే రెండో వారం నుంచి పనులు మరింత వేగవంతం కానున్నాయి" అని రత్నకుమార్ చెప్పారు.
లోకేష్ కనగరాజ్ సినిమాలకు స్క్రిప్ట్ వర్క్‌లో కీలక పాత్ర పోషించే రత్నకుమార్ మాటలతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. లోకేష్ మార్క్ యాక్షన్, అల్లు అర్జున్ స్వాగ్ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మూవీ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని, ఇందులో బన్నీ క్యారెక్టరైజేషన్ ముందెన్నడూ చూడని విధంగా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం.
![]() |
![]() |