![]() |
![]() |

ప్రజెంట్ ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో ప్రభాస్ (Prabhas) ఒకరు. ఆయనతో సినిమా చేయడానికి బడా నిర్మాతలు, దర్శకులు పోటీ పడుతుంటారు. అలాగే, ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి స్టార్ హీరోయిన్లు క్యూ కడతారు. ఎందరో బాలీవుడ్ బ్యూటీలు ప్రభాస్ తో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటిది ప్రభాస్ కి జోడిగా ఒక కొత్త అమ్మాయి నటించనుండటం ఆసక్తికరంగా మారింది.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాని ప్రకటించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ తాజాగా లాంచ్ అయింది. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ఇమాన్వి (Imanvi) అనే యువతి నటిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో అసలు ఎవరీ ఇమాన్వి? మొదటి సినిమాకే ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఎలా వచ్చింది? అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
ఇమాన్వి అసలు పేరు ఇమాన్ ఎస్మాయిల్ (Iman Esmail). పాకిస్తానీ మూలాలున్న ఇమాన్వి.. ఇండియాలో సెటిల్ అయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటుంది. ఆమె యాక్టర్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. చూడటానికి ఎంతో అందంగా ఉండే ఇమాన్వికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె చేసే రీల్స్, అందులో ఆమె వేసే స్టెప్స్ కి ఎంతో క్రేజ్ ఉంది. ఇమాన్వి చేసిన కొన్ని రీల్స్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి. అలా ట్రెండ్ అయ్యే.. ఆమె దర్శకుడు హను రాఘవపూడి కంటపడింది.
హను రాఘవపూడి సినిమాల్లో హీరోయిన్ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కథకి సరిగ్గా సరిపోయేలా.. అందం, అభినయం ఉన్న హీరోయిన్లను వెతికి పట్టుకోవడంలో హను దిట్ట. 'అందాల రాక్షసి'లో మిథునగా లావణ్య త్రిపాఠి, 'సీతారామం' సీతగా మృణాల్ ఠాకూర్ పాత్రలు ఎంతలా ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకున్నాయో తెలిసిందే. ఇప్పుడదే బాటలో ప్రభాస్ సినిమాకి సరిగ్గా సరిపోయే హీరోయిన్ అని భావించి ఇమాన్విని ఎంపిక చేశాడు. మరి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. సినిమాల్లో ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి.
![]() |
![]() |