![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మూవీ 'పెద్ది'. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన జాన్వీ కపూర్ రోల్ పై విడుదల సమయంలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పాత్రను దారుణంగా చూపించారనే కామెంట్స్ వినిపించాయి. దీంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి, కొన్ని సీన్స్ కూడా తొలిగించారు.
అయినప్పటికీ 'పెద్ది'లో జాన్వీ కపూర్ పాత్రపై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ నటి అదితీ బాలన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
"అసలు ఇలాంటి క్యారెక్టర్‌ను ఎందుకు రాశారు? ఇది చాలా పొరపాటు.. ఆమె పాత్రకు కొంత అర్థవంతమైన ప్రాధాన్యత ఇచ్చి, మరింత మెరుగ్గా రాసి ఉంటే బాగుండేది" అంటూ అదితీ బాలన్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపాయి.
తమిళంలో 'అరువి' లాంటి పవర్‌ఫుల్ పెర్ఫార్మన్స్ డ్రివెన్ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన అదితీ బాలన్.. చిత్ర పరిశ్రమలో మహిళా పాత్రల ప్రాధాన్యత, రైటింగ్ క్వాలిటీ గురించి ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. అలాంటి నటి, ఇప్పుడు 'పెద్ది' మూవీలోని లేడీ లీడ్ రోల్ రైటింగ్ పై ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
Ram Charan, Peddi Movie, Janhvi Kapoor Role, Aditi Balan
![]() |
![]() |