![]() |
![]() |

ఒకప్పుడు స్టార్ హీరో సినిమా కూడా రూ.100 కోట్ల గ్రాస్ రాబడితే గొప్ప. కానీ, ఇప్పటి పాన్ ఇండియా ట్రెండ్ లో ఏకంగా రూ.1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటున్నారు. ఇప్పటికే పలు సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాయి. ఇటీవల విడుదలైన 'వార్-2', 'కూలీ' సినిమాలకు కూడా వెయ్యి కోట్లు రాబట్టగల సత్తా ఉందని అందరూ భావించారు. "అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి" అన్నట్టుగా ఇప్పుడు ఆ రెండు సినిమాలు కలిపి కూడా వెయ్యి కోట్లు రాబట్టడం కష్టంగా మారింది. (War 2 vs Coolie)
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించడంతో 'వార్-2'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ కావడంతో పాటు.. నాగార్జున, ఆమిర్ ఖాన్ వంటి వారు ఉండటంతో 'కూలీ'పై కూడా అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఏర్పడ్డాయి. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అయితే 'కూలీ' సంచలనాలు సృష్టించింది. పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్ల గ్రాస్ రాబట్టగల సత్తా ఈ రెండు సినిమాలకు ఉందని ట్రేడ్ వర్గాలు కూడా అభిప్రాయపడ్డాయి. ముఖ్యంగా 'కూలీ'పై నెలకొన్న హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ రెస్పాన్స్ చూసి.. ఎన్నో వండర్స్ క్రియేట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ విడుదల తర్వాత అందుకు భిన్నంగా జరుగుతోంది.
ఆగస్టు 14న విడుదలైన 'వార్-2', 'కూలీ' సినిమాలు రెండూ కూడా డివైడ్ టాక్ నే సొంతం చేసుకున్నాయి. దీంతో ఆ సినిమాల రేంజ్ కి తగ్గ కలెక్షన్స్ రావట్లేదు. 'వార్-2' ఇప్పటిదాకా రూ.300 కోట్ల గ్రాస్ రాబడితే.. 'కూలీ' రూ.400 కోట్ల గ్రాస్ రాబట్టింది. సోమవారం నుంచి ఈ రెండు సినిమాల కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయి. నార్త్ ఇండియా, నార్త్ అమెరికాలో 'కూలీ' కంటే 'వార్-2' కాస్త బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ.. ఆ సినిమా రేంజ్ కి ఈ కలెక్షన్స్ ఏ మాత్రం సరిపోవు. ఫుల్ రన్ లో మహా అయితే 'వార్-2' రూ.400 కోట్లు, 'కూలీ' రూ.500 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. అదే జరిగితే రెండు సినిమాలు కలిపి కూడా వెయ్యి కోట్లు రాబట్టడం కష్టమే అవుతుంది.
![]() |
![]() |