![]() |
![]() |

ఆగస్టు 14న 'వార్-2', 'కూలీ' అనే రెండు భారీ సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టాయి. ఈ రెండు సినిమాలపైనా మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే 'వార్-2'తో పోలిస్తే 'కూలీ'పై హైప్ ఇంకా ఎక్కువ ఉంది. అది అడ్వాన్స్ బుకింగ్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపించింది. అయితే విడుదల తర్వాత ఈ రెండు సినిమాలు డివైడ్ టాక్ నే సొంతం చేసుకున్నాయి. అయినప్పటికీ మొదటి వీకెండ్ లో 'వార్-2' దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ రాబడితే.. 'కూలీ' మాత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ తో సత్తా చాటింది. ఇలా అడుగడుగునా కూలీ డామినేషన్ కనిపిస్తోంది. దీంతో ఇక 'వార్-2' పని అయిపోయినట్లేనని అందరూ భావించారు. కానీ, ఇలాంటి టైంలో 'వార్-2' అనూహ్యంగా పుంజుకొని షాక్ ఇచ్చింది.
ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా పాజిటివ్ టాక్ రాకపోతే వీక్ డేస్ లో భారీ డ్రాప్ కనిపించడం సహజం. 'వార్-2', 'కూలీ' సినిమాల విషయంలోనూ అదే జరిగింది. సోమవారం నాడు ఈ రెండు సినిమాల కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. ముఖ్యంగా 'వార్-2' పూర్తిగా చేతులెత్తేసినట్లు అనిపించింది. ఇలాంటి సమయంలో ఊహించని విధంగా పుంజుకొని బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది వార్-2.

మంగళవారం నాడు బుక్ మై షోలో బుకింగ్స్ ని గమనిస్తే.. 'వార్-2' టికెట్లు గంటకు 9.2K బుక్ అవ్వగా, 'కూలీ' టికెట్లు మాత్రం 4.9K బుక్ అయ్యాయి. అంటే బుక్ మై షోలో 'కూలీ'కి దాదాపు రెట్టింపు స్థాయిలో 'వార్-2' టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. ఫుల్ రన్ లో 'కూలీ'కి 'వార్-2' షాకిచ్చినా ఆశ్చర్యంలేదు.

ఓవరాల్ గా ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'వార్-2'కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ నటించినప్పటికీ తెలుగు బుకింగ్స్ లో ఆ జోష్ లేదు. నార్త్ లో మాత్రం జోష్ కనిపిస్తోంది. హిందీ సినిమా కావడం, ప్రస్తుతం అక్కడ ఇతర స్టార్ల సినిమాలు లేకపోవడంతో.. వార్-2 చూడటానికి నార్త్ ఆడియన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే బుక్ మై షోలో 'కూలీ'ని 'వార్-2' ఈ రేంజ్ లో డామినేట్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
![]() |
![]() |