![]() |
![]() |
.webp)
'ఫలక్ నామాదాస్' తో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని పొందిన హీరో విశ్వక్ సేన్(Vishwak Sen).అభిమానుల చేత 'మాస్ కాదాస్' అని పిలిపించుకుంటు విభిన్న తరహా చిత్రాల్లో నటిస్తు తనదైన శైలిలో దూసుపోతున్నాడు.రీసెంట్ గా గత నెల ఫిబ్రవరిలో 'లైలా'మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మార్చి 16 ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్(Hyderabad)ఫిలింనగర్ రోడ్ నెంబర్ 8 లో ఉన్న విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం జరిగింది. విశ్వక్ సేన్ సోదరి ఉంటున్న గదిలోకి వెళ్లి కొన్ని బంగారు ఆభరణాల్ని దొంగిలించినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు(Karate Raju)ఫిలింనగర్ ఏరియా పోలీసులకి ఫిర్యాదు చేసాడు.దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.దొంగతనం మొత్తం 20 నిమిషాల్లో జరగడం, ఆగంతుకుడు దర్జాగా గేట్ తీసుకొని వెళ్లడం చూస్తే తెలిసిన వాళ్ళు ఎవరైనా చేసుండవచ్చనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.చోరీ చేసిన విలువ సుమారు మూడు లక్షల దాకా ఉంటుందని తెలుస్తుంది.
విశ్వక్ సేన్ 'లైలా'(Laila)మూవీ దారుణమైన పరాజయాన్ని అందుకోవడమే కాకుండా సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు,డైలాగులు అసభ్యకరంగా ఉండటంతో మహిళా సంఘాల నుంచి విమర్శలు వచ్చాయి.దీంతో లైలా లాంటి మూవీలో నటించినందుకు క్షమించండని, ఇకపై అలాంటి సినిమాల్లో,సన్నివేశాల్లో నటించనని విశ్వక్ సేన్ ఒక లేఖని విడుదల చెయ్యడం జరిగింది.ఈ మూవీలో విశ్వక్ తొలిసారిగా లేడీ క్యారక్టర్ లో కనిపించాడు.
![]() |
![]() |