![]() |
![]() |

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram)అప్ కమింగ్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun son of vyjayanthi)2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'డెవిల్' తర్వాత కొంచం గ్యాప్ తీసుకొని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో వస్తున్నాడు.దీంతో నందమూరి(Nandamuri)అభిమానుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayashanthi)'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మళ్ళీ ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇస్తుంది.వైజయంతి అనే పవర్ ఫుల్ పోలీసు క్యారక్టర్ ని పోషిస్తుండగా, ఆమె కొడుకు అర్జున్ గా కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు.రీసెంట్ గా ఈ మూవీకి సంబందించిన టీజర్ రిలీజ్ ఫంక్షన్ జరిగింది.
ఈ కార్యక్రమంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతు'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'మూవీ స్టార్ట్ అయినప్పుడు విజయశాంతి అమ్మ ఒక మొక్కు పెట్టుకున్నారు.సినిమా రిలీజ్ రోజు అమ్మ,నేను తిరుపతి(tirupati)వెళ్తున్నాం.అలిపిరి నుంచి కొండపైకి కాలి నడకన వెళ్లి ఏడుకొండల వాడ్ని దర్శనం చేసుకుంటున్నాం.అప్పటి నుంచి అమ్మ నాన్ వెజ్(Non Veg)కూడా తినలేదు.తిరుపతి వెళ్లొచ్చిన కొన్నిరోజులకి అమ్మకి చేపల పులుసు పంపిస్తానని చెప్పాడు. విజయశాంతి కూడా మాట్లాడుతు ఈ మూవీలో నటించడం నా అదృష్టం.మూవీ చాలా బాగా వచ్చింది,నాఅభిమానులు కోరుకున్న అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఒక రకంగా ఫుల్ మీల్స్ అని చెప్పుకొచ్చింది.ఈ ఫంక్షన్ లో నిజ జీవితంలో తల్లి కొడుకుల లాగానే కళ్యాణ్ రామ్, విజయశాంతి మాట్లాడటం పలువుర్ని ఆకర్షిస్తుంది
టీజర్ అయితే ఒక రేంజ్ లో ఉంది.నందమూరి అభిమానులకి,మాస్ ప్రేక్షకుల్లో పండుగ వాతావరణాన్ని తెచ్చే మూవీ అవుతుందని చెప్పవచ్చు.ఎన్టీఆర్ ఆర్ట్స్(Ntr Arts)అండ్ అశోక క్రియేషన్స్ పై కళ్యాణ్ రామ్, అశోక్ వర్ధన్,సునీల్ బలుసు నిర్మించగా,సాయి మంజ్రేకర్(Saiee Manjrekar)హీరోయిన్ గా చేస్తుంది.సోహైల్ ఖాన్,శ్రీకాంత్,పృథ్వీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మే 26 న విడుదల కానుండగా ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri)దర్శకుడు.అజనీష్ లోకనాద్ మ్యూజిక్ ని అందించాడు.

![]() |
![]() |