![]() |
![]() |

విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'గామి'. వి సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రానికి విద్యాధర్ దర్శకుడు. చాందిని చౌదరి హీరోయిన్. ఎప్పుడో 2021లో ప్రకటించిన ఈ సినిమా భారీస్థాయిలో రూపొందింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకొని సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా చేశాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేలా చేసింది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా తాజాగా 'గామి' ట్రైలర్ విడుదలైంది. మూడు నిమిషాల 43 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ కట్టిపడేసేలా ఉంది. విభిన్న కాన్సెప్ట్, అద్భుతమైన విజువల్స్ తో బిగ్ స్క్రీన్ పై గొప్ప అనుభూతిని పంచేలా ఉంది. ఇందులో విశ్వక్ అఘోర పాత్రలో కనిపిస్తున్నాడు. అతను అరుదైన సమస్యతో బాధపడుతుంటాడు. అతని కథతో మరికొన్ని కథలను ముడిపెడుతూ దర్శకుడు అద్భుతంగా చిత్రాన్ని మలిచాడని ట్రైలర్ తో అర్థమవుతోంది. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, నరేష్ కుమారన్ మ్యూజిక్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఆకట్టుకుంది. ట్రైలర్ ని బట్టి చూస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మ్యాజిక్ చేయడం ఖాయమనిపిస్తోంది.
![]() |
![]() |