![]() |
![]() |

విడుదలకు సిద్ధమైన `సీటీమార్` కోసం మిల్కీ బ్యూటీ తమన్నాతో తొలిసారిగా రొమాన్స్ చేసిన మ్యాచో స్టార్ గోపీచంద్.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న `పక్కా కమర్షియల్`లో స్టన్నింగ్ బ్యూటీ రాశీ ఖన్నాతో ముచ్చటగా మూడోసారి ఆడిపాడుతున్నాడు. కట్ చేస్తే.. ఆపై రాబోయే సినిమాలో `ఇస్మార్ట్` బ్యూటీతో ఫస్ట్ టైమ్ జట్టుకట్టనున్నాడట గోపి.
ఆ వివరాల్లోకి వెళితే.. `లక్ష్యం`, `లౌక్యం` వంటి ఘనవిజయాల తరువాత శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రంలో గోపీచంద్ కి జంటగా `ఇస్మార్ట్ శంకర్` ఫేమ్ నభా నటేశ్ ఎంపికైందని సమాచారం. అంతేకాదు.. `లక్ష్యం`లో అనుష్క, `లౌక్యం`లో రకుల్ ప్రీత్ సింగ్ కి ఎలాగైతే గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్ పడ్డాయో.. అలాగే ఇందులో హీరోయిన్ పాత్ర ఉంటుందని వినికిడి. త్వరలోనే గోపీచంద్ - శ్రీవాస్ థర్డ్ జాయింట్ వెంచర్ లో నభా నటేశ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, యూత్ స్టార్ నితిన్ కి జోడీగా నభా నటేశ్ నటించిన `మాస్ట్రో` విడుదలకు సిద్ధమైంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అంధాధున్`కి రీమేక్ గా రూపొందిన ఈ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో పంద్రాగస్టున స్ట్రీమింగ్ కాబోతోందని ప్రచారం సాగుతోంది.
![]() |
![]() |