![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్‌గా తన తండ్రి సినిమాలకు పనిచేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్‌గా ఆమె తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశారు. తొలి యత్నంగా 'షూటవుట్ ఎట్ ఆలేరు' అనే వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ పోలీసాఫీసర్లుగా నటించిన ఎనిమిది ఎపిసోడ్ల ఈ సిరీస్ త్వరలో జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన ప్రమోషన్‌ను సుష్మిత మొదలు పెట్టారు. అంతలోనే ఇది కాంట్రవర్సీలో చిక్కుకోవడం గమనార్హం. పోలీస్ కేస్ ఫైల్స్ ఆధారంగా ఆనంద్ రంగా డైరెక్షన్‌లో 'షూటవుట్ ఎట్ ఆలేరు'ను నిర్మించినట్లు అధికారికంగా ప్రకటించారు. సంచలనం సృష్టించిన 2015 నాటి వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ ఉదంతం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్‌ను తీశారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది.
ఈ వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ కాకుండా నిలిపి వేయాలని హైదరాబాద్‌లోని మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) పార్టీ నేత అంజాదుల్లా ఖాన్ డిమాండ్ చేశారు. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ సందర్భంగా పోలీసులు షూట్ చేసిన వారందరినీ దోషులుగా ఈ సిరీస్‌లో దోషులుగా చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌ను మానవ హక్కుల సంఘం ఖండించిందనీ, అలాంటి ఎన్‌కౌంటర్ ఉదంతంలో పోలీసులను హీరోలుగా, నిందితులను దోషులుగా ఏకపక్షంగా ఈ సిరీస్‌లో చిత్రీకరిస్తున్నారనీ ఆయన ఆరోపించారు. అలా చూపిస్తే మాత్రం కచ్చితంగా కోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. ఈ వివాదంపై సుష్మిత ఏం చేస్తారో.. వెయిట్ అండ్ సీ...
![]() |
![]() |