![]() |
![]() |

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' మూవీ పాటిజివ్ టాక్ తో మొదటి వారం కలెక్షన్ల తుఫాన్ సృష్టించి సత్తా చాటింది. దీంతో ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంటుందని భావించారంతా. కానీ ఊహించని విధంగా బ్రేక్ ఈవెన్ కి 12 కోట్ల దూరంలో ఆగిపోనుంది. ఆంధ్రప్రదేశ్ లోని టికెట్ ధరలే ఈ పరిస్థితికి కారణమని చెప్పొచ్చు.
మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టికెట్ ధరలు పలు సినిమాలకి నష్టాన్ని కలిగించాయి. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'పుష్ప ది రైజ్' సైతం టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో ఏపీలో బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయింది. ఇక ఈ టికెట్ ధరల ప్రభావం 'భీమ్లా నాయక్' పైనా గట్టిగా పడింది. తాజాగా టికెట్ ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అప్పటికే 'భీమ్లా నాయక్' కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
రూ.108 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగిన భీమ్లా నాయక్ 12 రోజుల్లో 95.38 కోట్ల షేర్ రాబట్టింది. క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 12.62 కలెక్ట్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత కలెక్ట్ చేయడం అసాధ్యమనే చెప్పాలి. ఈరోజుల్లో థియేటర్స్ లో సినిమా పది పదిహేను రోజులే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పదోరోజు 1.90 కోట్ల షేర్ రాబట్టిన భీమ్లా నాయక్.. 11 వ రోజు 36 లక్షలు, 12 వ రోజు 27 లక్షలకు పరిమితమైంది. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు సినిమా లైఫ్ పదిరోజులు అని. భీమ్లా నాయక్ విడుదలైన 10 రోజుల తరువాత కొత్త జీవో వచ్చింది. అంటే భీమ్లా నాయక్ కి జరగాల్సిన నష్టం జరిగాక కొత్త జీవో వచ్చిందన్నమాట.
దానికి తోడు ఈ నెల 10 న సూర్య 'ఈటీ', 11 న ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా 'రాధేశ్యామ్' విడుదల తర్వాత భీమ్లా బాక్సాఫీస్ రన్ దాదాపు ముగిసినట్లే. అంటే భీమ్లా నాయక్ ఏ అద్భుతం చేసినా ఈ రెండు రోజుల్లోనే చేయాలి. కానీ ఇప్పటికే ఏపీలో మెజారిటీ ఆడియన్స్ సినిమా చూసి ఉండటం, వీక్ డేస్ కావడంతో.. పెద్దగా కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు. దాంతో ఈ సినిమా ఫైనల్ గా బయ్యర్లకు పది కోట్లకు పైగా నష్టం కలిగించనుంది.
తెలుగు రాష్ట్రాల్లో 88.75 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ 12 రోజుల్లో 74.74 కోట్లు రాబట్టింది. తెలంగాణలో 34.56 కోట్లు(35 కోట్ల బిజినెస్), ఆంధ్రప్రదేశ్ లో 40.18 కోట్లు(53.75 కోట్ల బిజినెస్) కలెక్ట్ చేసింది. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ కి చేరువైన ఈ మూవీ.. ఏపీలో మాత్రం 13 కోట్ల దూరంలో ఉంది. ఒకవేళ ఏపీలో సాధారణ టికెట్ ధరలున్నా లేదా కొత్త జీవో సినిమా విడుదలకు ముందు వచ్చినట్లైతే ఇప్పటికే భీమ్లా నాయక్ మరో 10-15 కోట్లు అదనంగా రాబట్టి క్లీన్ హిట్ గా నిలిచి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |