![]() |
![]() |
.jpg)
జయాపజయాలకు అతీతంగా ముందుకు సాగుతున్న యువ కథానాయకుల్లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఒకరు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీనివాస్.. తన నృత్యాలతో తొలి చిత్రం `అల్లుడు శీను`తోనే యువతని ఆకర్షించాడు. ఆపై వచ్చిన సినిమాలేవీ అంతగా ఆడకపోయినా.. రెండేళ్ళ క్రితం వచ్చిన `రాక్షసుడు`తో విజయాన్ని చూశాడు. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన `అల్లుడు అదుర్స్`.. బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్ సమేతంగా `ఛత్రపతి` రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు శ్రీనివాస్. ప్రి ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ లోపే ఓ బడా సంస్థలో తన తదుపరి చిత్రాన్ని కమిటయ్యాడట ఈ టాలెంటెడ్ యంగ్ హీరో. ఆ ప్రొడక్షన్ హౌస్ మరేదో కాదు.. యూవీ క్రియేషన్స్. అంతేకాదు.. డెబ్యూ డైరెక్టర్ కాంబినేషన్ లో ఈ సినిమా ఉంటుందని బజ్. త్వరలోనే బెల్లంకొండ, యూవీ క్రియేషన్స్ మూవీకి సంబంధించి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
![]() |
![]() |