Home  »  News  »  Udayabhanu: ఉదయభాను ఫ్రమ్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: స్టే ట్యూన్ 

Updated : Feb 28, 2026

 


-ఉదయభాను గురించి తెలియని వారు ఉన్నారా!
-తెలుగు వన్ తో ప్రసాదరావు గురించి ఏం చెప్తుంది 
-స్ట్రీమింగ్ కి  వచ్చేసింది 
-ఆసక్తికర విషయాలు మీ కోసం  

 


తెలుగు బుల్లితెరపై తనదైన ముద్ర వేసి, యాంకరింగ్‌ కి కొత్త గ్లామర్‌, వేగాన్ని అద్దిన నటి, యాంకర్  ఉదయభాను(Udaya Bhanu).చాలా కాలం తర్వాత ఆమె 'D/O ప్రసాద్ రావు' (Daughter of Prasad Rao) అనే విభిన్నమైన కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన చిత్రంతో ఓటిటి వేదికగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకి  వచ్చింది.. ఈ సినిమా కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు. ప్రతి ఇంట్లో ఉండే తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధాన్ని, నేటి సమాజంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సవాళ్లని ప్రతిబింబించే కథ. మూవీ గురించి ఆమె పంచుకున్న కొన్ని భావోద్వేగపూరితమైన విషయాలని  తెలుసుకుందాం.


నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులు బిజీ. పిల్లలు కూడా స్కూళ్లు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. దీనివల్ల వారి మధ్య ఉండాల్సిన సంభాషణ  తగ్గిపోతోంది. ముఖ్యంగా తండ్రి, కూతుళ్ల మధ్య ఉండే బంధం చాలా సున్నితమైనది. అక్కడ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే తలెత్తే ఇబ్బందులని ఈ చిత్రం చర్చించబోతోంది. తండ్రి పట్ల ఉండే గౌరవంతో పాటు కొన్ని సందర్భాల్లో తలెత్తే పశ్చాత్తాపం (Regret) వంటి అంశాలని  హృద్యంగా చూపించనుబోతున్నాం. మా నాన్న పేరుని నా పేరులో కొనసాగించడం ఆయనపై  నాకున్న గౌరవానికి నిదర్శనం.


షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, నా పిల్లల విషయంలో ఎప్పుడు రాజీ పడను.  షూటింగ్‌లో ఉన్నా సరే,  పిల్లలు సమయానికి తింటున్నారా లేదా అని ఆరా తీస్తాను.  'అమ్మ ఇంట్లో లేదనే వెలితిని వాళ్ళు అనుభవించకూడదని భావిస్తాను. పిల్లల పట్ల అతి సున్నితంగా వ్యవహరించడమే కాదు. వారిని క్రమశిక్షణతో పెంచడం కూడా ముఖ్యం.


నేటి కాలంలో సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై విపరీతంగా ఉంది. ఒకసారి దీనికి అలవాటు పడితే బయటకు రావడం కష్టం. ఇది పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది.పేరెంట్స్ బిజీగా ఉండటం వల్ల పిల్లలు సోషల్ మీడియా వైపు మళ్లుతున్నారని, అది ఎప్పుడూ మంచిది కాదని, పిల్లలతో గడిపే సమయాన్ని పెంచుకోవాలని ఆమె సూచించారు. సమాజంలో మహిళలపై లేదా ఇతరులపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలని అరికట్టడానికి సమిష్టి కృషి అవసరం.

సినిమా విశేషాలు:  ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
'D/O ప్రసాద్ రావు' చిత్రం  ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్. సినిమాలో వచ్చే సిట్యుయేషనల్ కామెడీ ప్రేక్షకులని నవ్విస్తూనే, కథలోని ఇంటెన్సిటీ మన  హృదయ స్పందనని పెంచుతుంది. 25 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌తో చిత్రీకరించాం. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.


ఒక నటిగా, ఒక తల్లిగా, ఒక కూతురిగా ఉదయభాను పంచుకున్న విషయాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. 'D/O ప్రసాద్ రావు' సినిమా ద్వారా ఆమె మరోసారి తన నటనా విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం మా తెలుగు వన్  వెబ్‌సైట్‌ ని  చూస్తూనే ఉండండి. అలాగే ఉదయభాను తో పాటు మరింత మంది తారల ఇంటర్వూస్ చూడాలంటే స్టే ట్యూన్  తెలుగు వన్(Telugu One)సినిమా  యూట్యూబ్ ఛానెల్‌ . కింద ఉన్న వీడియో కూడా చూడండి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.