Home  »  News  »  బండ్ల గణేశ్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్!

Updated : Feb 28, 2026

- బండ్ల గణేష్‌ మళ్లీ నిర్మాతగా రాబోతున్నారా?

- మెగాస్టార్ ఇచ్చిన  ఆ బంపర్ ఆఫర్ ఏంటి?

- బండ్ల గణేశ్ ఏం చెయ్యబోతున్నారు?

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), బాబీ కాంబినేషన్‌లో మెగా158 కన్‌ఫర్మ్ అయిన విషయం తెలిసిందే. కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. డిఫరెంట్ కథాంశాలతో సినిమాలను రూపొందించే బాబీ ఈసారి మెగాస్టార్ ఇమేజ్‌కి తగిన అద్భుతమైన కథను రెడీ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ లుక్ కూడా డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు, మెగాభిమానులకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి భార్యగా ప్రియమణి, ఆయన కూతురిగా మలయాళ హీరోయిన్ అనశ్వర రాజన్ ఎంపికయ్యారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన మరో కొత్త అప్‌డేట్ ఇప్ప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత కమెడియన్‌గా ఎదిగిన బండ్ల గణేశ్(Bandla Ganesh).. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ప్రొడ్యూసర్ అయిపోయారు. టాలీవుడ్‌లోని టాప్ హీరోలతో భారీ చిత్రాలు నిర్మించి అగ్ర నిర్మాత స్థాయికి వెళ్లిపోయారు. స్వతహాగా మెగా అభిమాని అయిన బండ్ల గణేశ్.. చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లకు వీరాభిమాని. వారిని తన దైవాలుగా భావిస్తానని పలు సందర్భాల్లో గణేష్ చెప్పారు. ఇప్ప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ వీరాభిమానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. 

గత కొన్ని సంవత్సరాలుగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న బండ్ల గణేశ్.. నటనకు కూడా దూరంగానే ఉన్నారు. ఇప్ప్పుడు మెగా158 చిత్రంలో చిరంజీవితో కలిసి నటిస్తున్నారు బండ్ల గణేష్. ఈ సినిమాలో అతనిది కీలక పాత్ర అని తెలుస్తోంది. సాధారణంగా కామెడీ రోల్స్ చేసే గణేష్.. ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపిస్తారని స‌మాచారం. ఏ క్యారెక్టర్ అయినా డైలాగుల్ని డిఫరెంట్ మాడ్యులేషన్‌లో చెప్పే గణేష్ పెర్‌ఫార్మెన్స్ ఈ సినిమాలో అంతకుమించి అనే స్థాయిలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.