Home  »  News  »  Tollywood Trending Today: మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. చరణ్ ఫ్యాన్స్ కి షాక్!

Updated : Mar 31, 2026

1. పెద్ది రిలీజ్ డేట్‌పై గందరగోళం:
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఏప్రిల్ 30 కి వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కి కూడా రావడం కష్టమే అంటున్నారు. రీసెంట్ గా ఒక మూవీ ఈవెంట్ లో నిర్మాత SKN కూడా.. 'పెద్ది' జూన్ 26న విడుదలవుతుందంటూ టంగ్ స్లిప్ అయ్యాడు. అదంతా తూచ్ అంటూ SKN మళ్ళీ వీడియో రిలీజ్ చేసినప్పటికీ.. పెద్ది పోస్ట్ పోన్ న్యూస్ కి మాత్రం బ్రేకులు పడట్లేదు.

2. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్:
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'AA22' నుంచి ఒక పవర్-ప్యాక్డ్ వీడియో గ్లింప్స్ వస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, ప్రస్తుత సమాచారం ప్రకారం.. మూవీ టీమ్ కేవలం టైటిల్ పోస్టర్‌తోనే సరిపెట్టే అవకాశం ఉందట. వీడియో కంటెంట్ కోసం ఫ్యాన్స్ మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని తెలుస్తోంది. అయితే బన్నీ బర్త్ డేకి రిలీజ్ చేయబోయే పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని సమాచారం.

3. అక్టోబర్ నుంచి దేవర-2:
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోయే ‘దేవర-2’ కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తవగా, ప్రస్తుతం మ్యూజిక్ వర్క్ జరుగుతోందట. తారక్ డేట్స్ కన్ఫర్మ్ కావడంతో అక్టోబర్ మూడో వారం నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. 

4. ‘వారణాసి’ షూటింగ్ అప్డేట్:
మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. మహేష్ తన భాగాన్ని సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం. షూటింగ్‌తో పాటు టెక్నికల్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోంది. కీరవాణి త్వరలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు ప్రారంభించనున్నారు. రాజమౌళి పక్కా ప్లానింగ్‌తో ఎలాంటి ఆలస్యం లేకుండా సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు.

5. మాఫియా డాన్‌గా చిరంజీవి:
'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న 'Mega 158' ప్రాజెక్టుకు సంబంధించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఈ ఎపిసోడ్‌లో చిరంజీవి 'మాఫియా డాన్'గా కనిపిస్తారని, ఆ సమయంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాయని టాక్ వినిపిస్తోంది.

6. అనుష్క శెట్టి విశ్వరూపం:
బాహుబలి తర్వాత అనుష్క శెట్టి మరో భారీ విజువల్ వండర్ 'కథనార్'తో అలరించడానికి సిద్ధమైంది. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. మాయా ప్రపంచాన్ని చూపిస్తూ ట్రైలర్ అద్భుతంగా సాగింది. 19వ శతాబ్దపు కేరళ నేపథ్యంలో.. దట్టమైన అడవులు, ప్రాచీన ఆలయాల మధ్య సాగే ఈ కథలో విజువల్స్ పీక్ లెవెల్‌లో ఉన్నాయి. ఇక ట్రైలర్‌లో అనుష్క తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరోసారి మ్యాజిక్ చేసింది.

7. జయలలిత భవనం సీజ్:
హైదరాబాద్‌లో ఉన్న తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలితకు చెందిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలో జె.జయలలిత పేరుతో భవనం ఉంది. ఇందుకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు 2017 నుంచి పేరుకుపోవటంతో.. జయలలితకు సంబంధించిన వ్యక్తులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు స్పందన లేకపోవడంతో తాజాగా అధికారులు భవనాన్ని సీజ్ చేశారు.

8. సల్మాన్ ఖాన్ సరసన నయనతార:
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందనున్న క్రేజీ ప్రాజెక్టులోకి లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'జవాన్'తో నార్త్ ఆడియన్స్‌ను కూడా మెప్పించిన నయనతార.. సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఈ యాక్షన్ డ్రామా 2027 ఈద్ కి ప్రేక్షకుల ముందుకు రానుంది.

9. మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్:
"అవకాశాల్లేక ఈగలు తోలుకుంటున్నాను" అంటూ సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలోని 'గురుతుందా' సాంగ్ లాంచ్ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈగలు తోలుకుంటున్న తన దగ్గరకు సాయి రాజేష్ వచ్చి, ఈ సినిమాకు మ్యూజిక్ చేయమని అడిగారని మెలోడీ బ్రహ్మ అన్నారు. 

10. నాగార్జునకు జోడిగా ఐశ్వర్య రాజేష్:
కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక 100వ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఇదే వీరి కాంబినేషన్ లో మొదటి సినిమా కావడం విశేషం. తమిళ్ డైరెక్టర్ రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'లాటరీ కింగ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.