![]() |
![]() |

2022లో అంచనాల్లేకుండా విడుదలైన 'డీజే టిల్లు' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా రూపొందిన 'టిల్లు స్క్వేర్'(Tillu Square) మంచి అంచనాలతో విడుదలై.. బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. 'డీజే టిల్లు' టోటల్ గా రూ.30 కోట్ల గ్రాస్ రాబడితే.. 'టిల్లు స్క్వేర్' కేవలం రెండు రోజుల్లోనే రూ.45 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశముంది.
సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'టిల్లు స్క్వేర్'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకులకు ముందుకు వచ్చి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ టాక్ కి తగ్గట్టే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం, మొదటి రోజే వరల్డ్ వైడ్ గా రూ.23.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక రెండో రోజు రూ.21.6 కోట్ల గ్రాస్ తో వసూలు చేయగా.. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.45.3 కోట్ల గ్రాస్ సాధించింది. మూడో రోజు ఆదివారం కావడంతో మరో రూ.15-20 కోట్ల గ్రాస్ రాబట్టి.. మూడు రోజుల్లోనే రూ.60 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది. ఇదే జోరు కొనసాగితే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం పెద్ద విషయం కాదు.

![]() |
![]() |