![]() |
![]() |

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'(Family Star). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'ఫ్యామిలీ స్టార్'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది.
విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా 'ఫ్యామిలీ స్టార్' టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈమధ్య ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ పెద్దగా రాకపోవడం, పైగా సమ్మర్ సీజన్ కూడా కావడంతో బుకింగ్స్ కి మంచి స్పందన లభిస్తోంది. సినిమాకి హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసే అవకాశముంది.

2018లో వచ్చిన 'గీత గోవిందం' వరల్డ్ వైడ్ గా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత విజయ్ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఆరేళ్ళ తర్వాత తనకు 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ కలిసి చేసిన 'ఫ్యామిలీ స్టార్'తో వస్తున్నాడు. మరి ఈ సినిమా కూడా ఆ రేంజ్ సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |