![]() |
![]() |

2022 లో వచ్చిన డి జె టిల్లు (dj tillu) ఎంతగా ఘన విజయం సాధించిందో అందరకి తెలిసిందే. ఆ మూవీతో సిద్దు జొన్నలగడ్డ( siddu jonnalagadda) ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చిన మూవీ టిల్లు స్క్వేర్ (Tillu square) వరల్డ్ వైడ్ గా నిన్న విడుదల అయ్యింది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
టిల్లు స్క్వేర్ వరల్డ్ వైడ్ గా 23 .7 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించింది. ఒక రకంగా సిద్దు కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్ అని చెప్పవచ్చు. ప్రెజంట్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తున్న నేపధ్యంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.దీంతో టిల్లు మావ తన హవాని మరింతగా కొనసాగించవచ్చు. ఎలాగు వీకండ్స్ ఉండనే ఉన్నాయి.ఇక సిద్దు కెరీర్లోనే అత్యధిక బడ్జట్ తో సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. రిలీజ్ కి ముందు నిర్మాత నాగ వంశీ చెప్పినట్టుగా ప్రతి ఫేమ్ కూడా రిచ్ గా ఉండి ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.

ఇక సిద్దు, అనుపమ పరమేశ్వరన్ (anupama parameswaran) ల నటనకి థియేటర్స్ లో విజిల్స్ మీద విజిల్స్ పడుతున్నాయి.యూత్ మొత్తం ఆ ఇద్దరి యాక్టింగ్ కి ఫిదా అవుతుంది. అలాగే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. సాంగ్స్ కి కూడా బాగున్నాయనే పేరు వస్తుంది. మల్లిక్ రామ్ దర్శకత్వాన్ని వహించగా రామ్ మిరియాల భీమ్స్ సంగీతాన్ని అందించాడు.
![]() |
![]() |