![]() |
![]() |

టాలీవుడ్ హీరోలలో నవదీప్ ది విభిన్న శైలి. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇతర హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తుంటారు. అలాగే బుల్లితెరపై హోస్ట్ గా తన ప్రత్యేకతను చాటుకోవడమే కాకుండా, ఓటీటీలోనూ రాణిస్తున్నారు. ఇలా యాక్టర్ గా, హోస్ట్ గా ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న నవదీప్, హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లవ్ మౌళి'. నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పంఖురి గిద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ చిత్రంలో పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో కొత్తగా కనిపిస్తున్న నవదీప్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్.
'ది యాంథమ్ ఆఫ్ లవ్ మౌళి' పేరుతో ఈరోజు(సెప్టెంబర్ 15) లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర బృందం. గోవింద్ వసంత అందించిన సంగీతం విభిన్నంగా, రొమాంటిక్ సాంగ్స్ లో ఓ కొత్త అనుభూతిని కలిగించేలా ఉంది. "అందాలు చదివే కళ్ళకైనా.. ఖండాలు తిరిగే కాళ్ళకైనా" అంటూ పాట ఎంతో ఆసక్తికరంగా మొదలైంది. గీత రచయిత అనంత్ శ్రీరామ్ మరోసారి తన కలం బలం చూపించారు. తేలికైన పదాలు, లోతైన భావంతో పాటను ఎంతో అందంగా రాశారు. అద్భుతమైన సంగీతం, సాహిత్యానికి.. అనీష్ కృష్ణన్ గాత్రం తోడై పాట మరింత అందంగా మారింది. లిరికల్ వీడియోని బట్టి చూస్తే స్క్రీన్ మీద హీరో-హీరోయిన్ ల కెమిస్ట్రీ హైలైట్ గా నిలవనుందని అర్థమవుతోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
![]() |
![]() |