![]() |
![]() |

చియాన్ విక్రమ్(vikram)హీరోగా అగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా విడుదలైన మూవీ తంగలాన్(thangalaan)విక్రమ్(vikram)నటనతో పాటు మిగతా ఆర్టిస్టుల నటనకి కూడా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఇప్పుడు మంచి ప్రశంసలు అందుతున్నాయి. దీంతో ఆల్ ఏరియాస్ పాజిటివ్ టాక్ వస్తుంది. కలెక్షన్స్ నెంబర్ ఆ విషయాన్నీ స్పష్టంగా చెప్తుంది.
ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఇరవై కోట్ల రూపాయిల గ్రాస్ ని తంగలాన్ రాబట్టింది. తమిళనాడు లో పన్నెండు కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కలిపి 2 కోట్లు, అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఎనిమిది కోట్ల రూపాయలని రాబట్టింది. ఇందులో 7 కోట్లు ఇండియా నుంచి రాగా మిగతా మొత్తం ఓవర్ సీస్ నుంచి వచ్చింది. దీంతో ఈ సంవత్సరం తమిళనాడులో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో ఫస్ట్ డే హయ్యస్ట్ కలెక్షన్ సాధించిన మూడవ సినిమాగా తంగలాన్ నిలిచింది. ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో భారతీయుడు 2 , రాయన్ లు ఉన్నాయి.
సూపర్ స్టార్ రజనీ కాంత్(rajinikanth) వన్ మాన్ షోస్ కబాలి, కాలా ని అందించిన పా రంజిత్(pa ranjith) దర్శకత్వంలో తంగలాన్ తెరకెక్కింది. పార్వతి తిరువొతు, మాళవిక నాయర్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో చెయ్యగా జ్ఞానవేల్ రాజా అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు.బ్రిటిష్ పరిపాలనా కాలంలో కోలార్ గోల్డ్ నేపథ్యంలో జరిగిన కథగా తెరకెక్కింది.
![]() |
![]() |