![]() |
![]() |
.webp)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ఆయనతో పాటు ఆయన కుమార్తె ఆద్యతో దిగిన సెల్ఫీపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీపై ఆద్య తల్లి రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఆ పిక్ ని పోస్ట్ చేసి అందమైన కామెంట్ ని పెట్టారు. "స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి నాన్నతో కలిసి వెళ్లొచ్చా ? అని ఆద్య అడిగింది. ఆద్య నన్ను అలా అడగడం ఎంతో ఆనందం కలిగించింది.
ఎందుకంటే, ఆద్య తన తండ్రితో కొంత సమయం గడపాలని కోరుకుంటోంది. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి జీవితం ఎంత బిజీగా ఉంటుందో, తన తండ్రి ఏపీ ప్రజల కోసం ఎంత పాటుపడుతున్నారో చూసి అర్థం చేసుకుని, అభినందించే అవకాశం ఆద్యకు వచ్చింది" అంటూ రేణూ దేశాయ్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సుపుత్రుడు అకీరాతో, కూతురు ఆద్యతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్న విషయం తెలిసిందే. తాను డిప్యూటీ సీఎం అయ్యాక అకీరాని కూడా తనతో కలిసి తీసుకెళ్లారు.
![]() |
![]() |