![]() |
![]() |
.webp)
యువసామ్రాట్ నాగ చైతన్య(Naga Chaitanya)స్టార్ హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi)జంటగా నటించిన తండేల్(Thandel)ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడం,కార్తికేయ 2 తో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన చందు మొండేటి(Chandu Mondeti)దర్శకుడు కావడంతో,తండేల్ పై అక్కినేని ఫ్యాన్స్ లోనే కాకుండా,ప్రేక్షక లోకంలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ మూవీకి సంబంధించిన ట్విట్టర్ టాక్ ని చూసుకుంటే మూవీ మొత్తానికి చైతు,సాయిపల్లవి ల నటన,దేవిశ్రీ ప్రసాద్(Devi Sriprasad)అందించిన సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలట్ గా నిలిచాయనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు.దర్శకుడు మాత్రం తను అనుకున్న కథని చెప్పడంలో కొంచం తడబాటుకి గురయ్యాడని,ఇంటర్వెల్ ముందు వరకు పెద్దగా డ్రామా వర్క్ అవుట్ కాలేదని, పైగా ఫస్ట్ ఆఫ్ మొత్తం కొంచం స్లోగా నడిచిందని రాసుకొస్తున్నారు.సెకండ్ ఆఫ్ లో వచ్చిన పాకిస్థాన్ ఎపిసోడ్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు .
‘బుజ్జి తల్లి',శివుడి పాటల్ని పిక్చరైజ్ చేసిన తీరు మాత్రం చాలా బావుందని అంటున్నారు.ఓవర్ ఆల్ గా తండేల్ ని చైతు,సాయిపల్లవి, దేవిశ్రీ ప్రసాద్ తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ నిలబెట్టాయనే అభిప్రాయాన్ని కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.మరి అసలు రివ్యూ వస్తే గాని పూర్తి వివరాలు తెలియవు.
![]() |
![]() |