![]() |
![]() |
.webp)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంక్రాంతి కానుకగా 'గేమ్ చేంజర్'(Game Changer)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా, డ్యూయల్ రోల్ లో చరణ్ ప్రదర్శించిన పెర్ఫార్మెన్సు కి అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ మూవీ తర్వాత చరణ్ ఉప్పెన ఫేమ్ 'బుచ్చిబాబు'(Buchi Babu)దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ,చరణ్ కెరీర్ లో 16 వ చిత్రం .ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇక ఈ మూవీలో చరణ్ అంధుడుగా కనిపించబోతున్నాడనే రూమర్స్ కొన్ని రోజుల నుంచి ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చరణ్ సన్నిహిత వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.కళ్ళు కనిపించని పాత్రలో కాదు గాని,చరణ్ కి మరో వైకల్యం ఉంటుందనే రూమర్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి,మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది,కొన్ని రోజులు ఆగితే గాని తెలియదు.చరణ్ సరసన శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్(Janhvi Kapoor)హీరోయిన్ గా చేస్తుండగా,వివిధ భాషలకి చెందిన నటులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్(A.R Rehman)సంగీతాన్ని అందిస్తుండగా,మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసుకొని ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు తీసురావాలనేది చిత్ర బృందం యొక్క ప్లాన్.ఈ మూవీపై మెగా అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.

![]() |
![]() |