![]() |
![]() |

నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'తండేల్' (Thandel). అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన మూవీ టీం, ఆ ప్రమోషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం కోసం ఫిబ్రవరి 1న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ అల్లు అర్జున్ వస్తున్నట్లు కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 1 సాయంత్రం హైదరాబాద్ లో తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు నిన్న మేకర్స్ ప్రకటించారు. సరిగ్గా ఈవెంట్ కి 24 గంటల ముందు ఈవెంట్ ఉందని అనౌన్స్ చేశారు. పైగా వేదిక ఎక్కడని కూడా రివీల్ చేయలేదు. దీంతో 'పుష్ప-2' సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో ఉంచుకొని, అభిమానుల తాకిడి లేకుండా చూడాలనే ఉద్దేశంతో.. వేదికను రివీల్ చేయలేదని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా అసలు వేడుకనే వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరి వేడుకకు సరైన వేదిక దొరకలేదా లేక పోలీసుల నుంచి అనుమతి లభించలేదో కానీ.. మొత్తానికైతే పోస్ట్ పోన్ అయిందని వినికిడి. మళ్ళీ ఫిబ్రవరి 4న ఈవెంట్ నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
![]() |
![]() |